ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన రేవంత్‌రెడ్డి - telangana latest news

తెలంగాణ మునుగోడు ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. చండూరు సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్‌ వాడిన పరుష పదజాలం మంచిది కాదని పేర్కొన్నారు. అద్దంకి పై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొవాలని రేవంత్​రెడ్డి సూచించారు. ఇది ఇలా ఉంటే, మునుగోడులో వెలసిన రాజగోపాల్ వ్యతిరేక పోస్టర్లు చర్చాంశనీయం అయ్యాయి.

sorry
sorry

By

Published : Aug 13, 2022, 12:34 PM IST

Revanth Reddy apologized to Venkata Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. చండూరు సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్‌ పరుష పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొవాలని రేవంత్​రెడ్డి సూచించారు.

sorry

"ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు ప్రస్తావన, చండూర్ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్యలు భాష వాడటం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వెంకట్​రెడ్డిని ఇలా అగౌరవపరచడం మంచింది కాదు. తదపరి అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను." - రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

మునుగోడులో రాజగోపాల్ వ్యతిరేక పోస్టర్లు: మునుగోడు ప్రాంతం రాజ గోపాల్‌ను క్షమించదంటూ చౌటుప్పల్​లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్​టాపిక్​గా మారాయి. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయాడని.. పార్టీ అధినేత్రిని వేధిస్తుంటే ప్రత్యర్థితో బేరసారాలు ఆడాడంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు గోడపత్రికలు ముద్రించి పట్టణంలో అతికించారు. రాత్రికి రాత్రే వెలిసిన ఈ పోస్టర్ల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. విపక్షనేతలే ఇలా పోస్టర్లు వేసి ఉంటారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈనెల 21న అమిత్ షా సమక్షంలో భారీ సభ ఏర్పాటు చేసి భాజపా తీర్థం పుచ్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు భాజపా నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి 3 గ్రామాలకు ఓ సీనియర్ నేతను ఇంఛార్జ్​గా నియమించి ఉప ఎన్నిక సన్నాహాలు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details