ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం' - ngt orders on visakha lg fas incident

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్​లో స్టైరీన్ ఆవిరి లీకేజ్ దుర్ఘటనకు... యాజమాన్య నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించిన జస్టిస్ శేషశయన రెడ్డి కమిటీ.. మధ్యంతర నివేదికలో వెల్లడించింది. ప్రమాదానికి 5 ప్రధాన కారణాలను నివేదికలో పొందుపరిచింది. ప్రమాద నివారణకు ఏ దశలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని తేల్చి చెప్పింది.

'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం!'
'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం!'

By

Published : Jun 1, 2020, 3:53 PM IST

Updated : Jun 1, 2020, 8:00 PM IST

"మానవ తప్పిదమే కారణం.. ప్రమాద నివారణకు యాజమాన్యం తీసుకున్న చర్యలు శూన్యం".. అని ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్.. జస్టిస్ శేష శయనారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ప్రమాదానికి గల మరిన్ని కారణాలను మధ్యంతర నివేదికలో వివరించింది. రసాయన కర్మాగారంలో కనిష్ట ఉష్టోగ్రతల వద్ద పాలిమరైజేషన్ నిరోధానికి తోర్పడే టీబీసీ (టెరిటరీ బ్యుటైల్ క్యాథకాల్) నిల్వలు ప్లాంట్ లో లేవని గుర్తించింది. ఆవిరి ఆవరించే స్థలంలో ఆక్సీజన్ కరుగుదల.. 6 శాతం కంటే దిగువకు పడిపోయినా.. ఆ సమస్యను పరిష్కరించే పరిశీలించే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది.

నివేదికలోని ప్రధాన అంశాలు:

నివేదికలోని ప్రధానాంశాలు

పర్యావరణ అనుమతులు ముందుగా పొందకుండానే...

పర్యావరణ అనుమతులు పొందడం కోసం ఎల్జీ పాలిమర్స్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేసిన యత్నాల క్రమాన్ని ఈ మధ్యంతర నివేదికలో కమిటీ పొందు పరిచింది. అసలు పర్యావరణ అనుమతులు ముందుగా పొందకుండానే ఈ కర్మాగారం పని చేస్తోందని వెల్లడించింది. ఒక దశ నుంచి మరో దశకు కర్మాగారం విస్తరణ, పర్యావరణ అనుమతి పొందేందుకు యత్నించిన వ్యవహారం అంతా వివరించింది.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అవగాహన రాహిత్యం..

ఈ ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని... ఈ సంస్థకు పర్యావరణ అనుమతి ఉందా అన్న అంశంపై నిర్ధారణ కోరిందని కమిటీ గుర్తించింది. ఈ లేఖ రాయడం ద్వారా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి 2006 నాటి చట్ట నిబంధనలపై అవగాహనా రాహిత్యం తెలిసిపోతోందని కమిటీ చెప్పింది.

సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే..

ప్రమాదానికి కారణమైన స్టోరేజి ట్యాంకు లో స్టైరిన్ ఆటో పాలిమరైజేషన్ జరగడం, అత్యధిక ఉష్టోగ్రతలకు చేరడం, ఆవిరి రూపంలో చిన్నమార్గం నుంచి విపరీతమైన పీడనంతో బయటకు రావడాన్ని నిరోధించడానికి యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోలేదని తేల్చింది. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో చెప్పాలని ట్రైబ్యునల్​.. పరిశ్రమ యాజమాన్యానికి సూచించింది.

ఇదీ చూడండి:

'ప్రభుత్వాన్ని ఎంపీ విజయసాయి, సజ్జల నడిపిస్తున్నారు'

Last Updated : Jun 1, 2020, 8:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details