ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ వద్దు: వర్ల

విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నియమించవద్దని... తెదేపా నేత వర్ల రామయ్య గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తన కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న శామ్యూల్​ని ఎస్ఈసీగా నియమించాలనుకుంటున్నారని ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి, దోపిడీకి శామ్యూల్ సహకరించారనే.. ఆయనవైపు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. వాన్ పిక్, ఇందుటెక్ కుంభకోణాల్లో ఏ1 నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే... ఏ8, ఏ10గా శామ్యూల్ ఉన్నారని గుర్తుచేశారు.

By

Published : Mar 24, 2021, 5:26 PM IST

వర్ల రామయ్య
వర్ల రామయ్య

వర్ల రామయ్య

విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నియమించవద్దని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గవర్నర్​ను కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి, దోపిడీకి శామ్యూల్ సహకరించారనే ఆయనవైపు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ఆరోపించారు.

శామ్యూల్ ఐఏఎస్ అధికారిగా పనిచేసినప్పటికీ సీఎం జగన్​పై దాఖలైన 11 సీబీఐ కేసుల్లో రెండింటిలో సహ నిందితుడిగా విచారణను ఎదుర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలకు అధిపతిగా అవినీతి కేసుల్లో అంటకాగిన వ్యక్తిని నియమించటమేంటి..? రమేశ్​కుమార్ స్థానంలో గతంలో కనగరాజ్​ను నియమించిన ప్రభుత్వం... ఇప్పుడు శామ్యూల్ వైపు ఎందుకు ఆసక్తి చూపుతోంది..? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విశ్రాంత న్యాయమూర్తిని ప్రభుత్వం వాడుకుని వదిలేసిందా? గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే విజయసాయిరెడ్డి సహా అధికారపార్టీ నేతలంతా శామ్యూల్ తదుపరి ఎస్ఈసీ అని లీకులిస్తున్నారు. తన సహనిందితులందరినీ అందలమెక్కించటం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది.

-వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

ఇదీ చదవండి:

పోలవరం పనులపై మరోసారి అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details