ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ ఐఏఎస్ అధికారికి.,. "ఇండో నేపాల్ రతన్ పురస్కార్"!

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం .."ఇండో నేపాల్ రతన్ పురస్కార్" అవార్డును అందుకున్నారు. నేపాల్ వైస్ ప్రసిడెంట్ నందకిషోర్ పన్ చేతుల మీదుగా ఆదివారం ఈ అవార్డును స్వీకరించారు.

ఇండో నేపాల్ రతన్ పురస్కార్
ఇండో నేపాల్ రతన్ పురస్కార్

By

Published : Jun 20, 2022, 5:07 PM IST

నేపాల్ వైస్ ప్రెసిడెంట్ నందకిషోర్ పన్ చేతుల మీదుగా.. "ఇండో నేపాల్ రతన్ పురస్కార్" అవార్డును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం అందుకున్నారు. నిన్న ఈ అవార్డును ఆయన స్వీకరించారు.

"Indo Nepal Ratan Award"

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం.. నానో టెక్నాలజీ, సాఫ్ట్ స్కిల్స్, లీడర్‌షిప్ స్కిల్స్, లీగల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ 360 డిగ్రీలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హెల్త్ అండ్ సేఫ్టీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఓరియంటేషన్ క్లాస్‌లు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మైండ్ మ్యాప్‌లు, సోషల్, ఎకనామిక్ కల్చరల్ ఎవల్యూషన్, ఎగ్జామ్‌లకు ప్రిపరేషన్ వంటి రంగాల్లో.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వెబ్‌నార్లు నిర్వహించడం ద్వారా ఇండో-నేపాల్ వాసులకు సేవలు అందించారు. ఇందుకుగానూ.. లక్ష్మీకాంతంను "ఇండో నేపాల్ రతన్ పురస్కార్" అవార్డుతో సత్కరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details