ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2021, 7:26 PM IST

ETV Bharat / city

Tj reddy on army chopper crash: 'ప్రతికూల పరిస్థితులే కారణమవచ్చు... బ్లాక్ బాక్స్ కీలకం'

త్రివిధ దళాలను సమన్వయపరిచి, సీడీఎస్ బిపిన్ రావత్ దేశానికి ఎనలేని సేవలు అందించారని వైమానిక దళ విశ్రాంత వింగ్ కమాండర్ టీజే రెడ్డి అన్నారు. సైనిక హెలికాప్టర్ కూలి బిపిన్ రావత్‌ దుర్మరణం చెందడం త్రివిద దళాలకు తీరనిలోటన్నారు. హెలికాప్టర్ కూలిన ఘటనలో దర్యాప్తు తర్వాతనే.. అసలు కారణాలు వెల్లడవుతాయంటున్న టీజే రెడ్డితో "ఈటీవీ భారత్" ప్రతినిధి ముఖాముఖి.

Tj reddy on army chopper crash
Tj reddy on army chopper crash

ప్రశ్న: ఈ దుర్ఘటన ఎలా జరిగిందని భావిస్తున్నారు?
జవాబు: మొదటగా ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. వైమానిక దళంలో జరిగిన దుర్ఘటనలు చూసుకుంటే ప్రతిదానికి మూడునాలుగు కారణాలు ఉన్నాయి. సర్వసైన్యాధిపతి అయిన బిపిన్ రావత్ ప్రొగ్రామ్​ ఒక నెల రోజుల ముందే ప్లాన్ చేసి ఉంటారు. సడన్​గా నిర్ణయించినది కాదు. మంచి పైలట్, దాని రూట్, చాపర్ ఇలా అన్ని ప్లాన్ చేసి ఉంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాకూడా ప్రమాదం జరిగింది. వాతావరణం సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణం. పైలట్ ఎంత అనుభవజ్ఞుడైప్పటికీ విపత్కర పరిస్థితులు వచ్చినపుడు త్రుటిలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. సాంకేతిక లోపం జరిగి ఉండవచ్చు దర్యాప్తులో తెలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్​కు అన్ని అంశాల్లో ఫిట్​నెస్ ఉంటుంది. అందులో వీవీఐపీ వెళ్తున్నప్పుడు మరింతగా ఫిట్​నెస్​ను పరిశీలిస్తారు. మెషిన్ ఈజ్ మెషిన్. సడన్​గా ప్రమాదం ఏర్పడినప్పుడు మనం ఏం చేయలేము. మనకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూనూర్ తర్వాత దట్టమైన పొగమంచు ఉంది. ఇక ఐదారు నిమిషాల్లో దిగేముందు ప్రమాదం జరిగింది. అంటే ఆ సమయంలో హెలికాప్టర్​ను కిందకు లాగే గాలి ఏమైనా ఉందా? మరేమైనా విషయాలు ఉన్నాయా అనేది సమగ్రంగా దర్యాప్తు చేస్తే గానీ తెలియదు. దర్యాప్తు చేసినా కూడా ఈరోజు ఉన్న వాతావరణం రేపు ఉండదు.

ప్రశ్న: రష్యా తయారు చేసిన హెలికాప్టర్ గతంలో కూలిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు: జరిగాయి. ఇది మొదటిసారేం కాదు. అసోంలో ఒకసారి కూలిపోయింది. అలాగే దక్షిణాదిన వరదలు వచ్చినప్పుడు కూడా ప్రమాదం జరిగింది. రెండుమూడు సార్లు ప్రమాదాలు జరిగాయి. అక్కడున్న పరిస్థితులు వేరు. ఇక్కడున్న పరిస్థితులు వేరు. కానీ పరిస్థితిని బట్టి పైలట్ తప్పిదామా లేదా అని చెప్పలేం.

ప్రశ్న: బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్రమాదం ఏవిధంగా జరిగిందని అంచనా వేయొచ్చు?
జవాబు: బ్లాక్ బాక్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది హెలికాప్టర్ బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయినంత వరకు సమాచారాన్ని రికార్డు చేస్తుంది. ఎక్కడ ప్రయాణించింది, ఎంత ఎత్తులో ప్రయాణించింది.. చాపర్​లోని పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది అంతా రికార్డు అవుతుంది. లాస్ట్​లో కిందపడి బ్రేక్ అయినంత వరకు కూడా రికార్డు అవుతుంది. కమ్యూనికేషన్స్ అన్నీ కూడా రికార్డు అవుతాయి. ఈ రికార్డు దర్యాప్తులో చాలా ఉపయోగపడుతుంది.

ఇవీ చూడండి:

Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్​..!

ABOUT THE AUTHOR

...view details