ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల జలశయాల నీటి మట్టాలు పెరిగాయి. విశాఖలోని సీలేరు కాంప్లెక్స్ లోని డొంకరాయి జలశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జలాశయం 2 గేట్లు ఎత్తి 6,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మం. తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువైంది. జలాశయం 3 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో 7,182 క్యూసెక్కులు కాగా..ఔట్‌ఫ్లో 7,136 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 351.3 అడుగులు ఉంది. దాని గరిష్ఠ నీటి మట్టం 355 అడుగులు. తమ్మిలేరు జలాశయం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎర్రకాల్వ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో పంట పొలాలు నీటి మునిగాయి.