ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న పంచాయతీలకు గతంలోనే రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ కార్యక్రమం మండలాన్ని యూనిట్‌గా తీసుకుని చేపడతారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వీటిని ‘మొదటి సాధారణ ఎన్నికలు’గా పరిగణించి గత ఎన్నికలను పరిగణలోకి తీసుకోకుండా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ స్థానాలకు జనాభా ప్రాతిపదికన, బీసీ స్థానాలకు ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారు. ఎస్టీ లేదా ఎస్సీ మండల జనాభాను, మొత్తం మండల జనాభాతో భాగించి మండలంలో ఉన్న మొత్తం పంచాయతీల సంఖ్యతో గుణిస్తారు. ఇలా ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
పల్లెపోరు: రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారో తెలుసా..? - reservations in local body elections news
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ కార్యక్రమం మండలాన్ని యూనిట్‌గా తీసుకుని చేపడతారు. రిజర్వేషన్ కేటాయింపులు పూర్తయిన అనంతరం ఆయా వర్గాలకు కేటాయించిన స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు.
బీసీ వర్గం మండల ఓటర్లను, మొత్తం మండల ఓటర్ల సంఖ్యతో భాగించి మండలంలోని మొత్తం పంచాయతీల సంఖ్యతో గుణిస్తారు. ఇలా బీసీ స్థానాలను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలకు కేటాయించిన పంచాయతీలు పోగా మిగతా వాటిని యూఆర్ (అన్ రిజర్వ్డ్)గా ఖరారు చేశారు. రిజర్వేషన్ కేటాయింపులు పూర్తయిన అనంతరం ఆయా వర్గాలకు కేటాయించిన స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. ఎస్టీ స్థానాల్లో 50, ఎస్సీ స్థానాల్లో 50, బీసీ స్థానాల్లో 50, యూఆర్ స్థానాల్లో 50 శాతం చొప్పున మండలం మొత్తం మీద సగం పంచాయతీలను మహిళలకు కేటాయిస్తారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతల స్వీకరణ