ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ బదిలీల కొత్త షెడ్యూలు - ఏపీలో ఉపాధ్యాయ బదిలీలపై తాజా వార్తలు

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ చినవీరభద్రుడు సోమవారం జారీ చేశారు.

reschedule for teachers transfer process in anadhra pradesh
ఉపాధ్యాయ బదిలీల కొత్త షెడ్యూలు

By

Published : Nov 3, 2020, 6:44 AM IST

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నందున హేతుబద్ధీకరణను వాయిదా వేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం కొత్త షెడ్యూలును విడుదల చేసింది. మంగళవారం వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణ చేపడతారు. వెబ్‌ ఆధారిత బదిలీలు నిర్వహిస్తారు.

దశలవారీ షెడ్యూల్‌ ఇలా ఉంది..

  • ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నవంబరు 4 నుంచి 9 వరకు
  • ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఖాళీల ప్రకటన 10, 11
  • బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 12 నుంచి 16వ తేదీ వరకు
  • దరఖాస్తుల పరిశీలన 17, 18 తేదీల్లో
  • పాఠశాల, సర్వీసు పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితా 19-23
  • సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ 24-26
  • అభ్యంతరాల పరిష్కారం 27-29
  • తుది సీనియారిటీ జాబితా నవంబరు 30 - డిసెంబరు 2
  • పాఠశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలు 3-5
  • పాఠశాల కేటాయింపు జాబితా విడుదల 6-11
  • ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తుది కేటాయింపు జాబితా 12-13
  • వెబ్​సైట్​లో బదిలీ ఉత్తర్వులు డిసెంబర్ 14

ABOUT THE AUTHOR

...view details