ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ నుంచి చిన్న పాఠశాలలకు మినహాయింపు ఇవ్వాలని చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏడాదికి సరాసరి 20 వేలు లోపు ఫీజు ఉన్న పాఠశాలలను కమిషన్ నుంచి మినహాయించాలని కోరారు.
'రెగ్యులేటరీ కమిషన్ నుంచి చిన్న పాఠశాలలకు మినహాయింపు ఇవ్వాలి'
చిన్న పాఠశాలలకు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాఠశాలలను విభజన చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు.
సీపీఎం నేత మధుతోపాటు మరికొందరు ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పారు. రాష్ట్రంలో చిన్న, ప్రైవేటు పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో పరిగణించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పాఠశాలలను విభజన చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు స్కూళ్లకు వర్తింపజేయడంపై అసోషియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి'