ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 20లోగా ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక

అభివృద్ధిలోనే కాకుండా పరిపాలనలో కూడా వికేంద్రీకరణ అవసరమని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. విజయవాడలో తొలిసారిగా భేటీ అయిన కమిటీ... ఈనెల 20లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని స్పష్టం చేసింది.

Report of the High Power Committee within 20 of this month
Report of the High Power Committee within 20 of this month

By

Published : Jan 7, 2020, 8:01 PM IST

Updated : Jan 7, 2020, 8:27 PM IST

ఈనెల 20లోగా ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నిశ్చయించిన హైపవర్ కమిటీ... పరిపాలనలో కూడా వికేంద్రీకరణ అవసరమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ మేరకు విజయవాడ బస్టాండ్‌లోని కాన్ఫరెన్స్ హాలులో తొలిసారి సమావేశమైన హై పవర్ కమిటీ.. జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలపై సుదీర్ఘంగా చర్చించింది.

20లోగా నివేదిక ఇస్తాం: ఆర్థిక మంత్రి బుగ్గన

మరో మూడు రోజుల్లో హైపవర్ కమిటీ మరోసారి భేటీ అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. అన్ని భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సమావేశం మాత్రమే జరిగిందని.. తదుపరి సమావేశాల్లో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై చర్చించామని మంత్రి కన్నబాబు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కమిటీ అంచనాకు వచ్చిందని అన్నారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే కారుపై రాళ్ళు రువ్వడానికి గన్​మెన్​ కారణమా..?

Last Updated : Jan 7, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details