ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో ప్రారంభమైన రీపోలింగ్‌ - గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు 2020

తెలంగాణలోని.. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమైంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.

repoll-starts-in-old-malakpet-division
repoll-starts-in-old-malakpet-division

By

Published : Dec 3, 2020, 7:44 AM IST

తెలంగాణ హైదరాబాద్ లోని.. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో మొత్తం 54,502 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 27,811 మంది కాగా... మహిళా ఓటర్ల సంఖ్య 26,688. ఇతరులు ముగ్గురున్నారు.

23 పోలింగ్​ కేంద్రాల్లో ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఓల్డ్ మలక్​పేట డివిజన్​లో ఇవాళ సెలవు ప్రకటించారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. సెలవును అన్ని కార్యాలయాల అధిపతులు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రీపోలింగ్ కోసం 12 మంది మైక్రో అబ్జర్వర్లను ఈసీ నియమించింది.

ఇదీ చదవండి:అవినీతిలో ఆసియా కప్పు మనదే!

ABOUT THE AUTHOR

...view details