ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో పర్యటించిన సీఐ.. గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికలపై సీఐ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించిందని.. గ్రామంలో అందరూ చర్చించుకుని ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నగదు వస్తుందని ఆయన తెలిపారు. లేదంటే ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వ అధికారి ఏకగ్రీవ ఎన్నికల గురించి మాట్లాడటంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.