ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2022, 6:46 PM IST

ETV Bharat / city

'కాలర్ పట్టుకున్నందుకు రేణుకపై.. బస్సు ధ్వంసం చేసినందుకు కార్యకర్తలపై కేసులు'

కాంగ్రెస్ పార్టీ చలో రాజ్​భవన్ కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్​ఐ కాలర్ పట్టుకున్నారని రేణుకా చౌదరిపై, ఆర్టీసీ బస్​పై దాడి చేసి, ఉద్యోగిని బెదిరించినందుకు.. కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

case
కార్యకర్తలపై కేసులు

ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్టేషన్​లో కేసు నమోదైంది. ఎస్‌ఐ ఉపేంద్ర ఆమెపై ఫిర్యాదు చేశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పంజాగుట్ట ఠాణా ఎస్‌ఐ రాజ్ భవన్ రోడ్డులో విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్ భవన్ మట్టడికి బయలుదేరిన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు అడ్డకున్నారు. దీంతో పోలీసులకు ఆమెకు వాగ్వాదం జరిగింది. ఆమెను పోలీసు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా.. 'నన్నే అరెస్టు చేస్తారా' అంటూ ఎదురుగా ఉన్న ఎస్‌ఐ ఉపేంద్ర బాబు కాలర్ పట్టుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధుల్లో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్‌ఐ పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఖైరతాబాద్ కూడలి వద్ద ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసిన ఘటనపై డ్రైవర్ సైతం పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు. బస్సు అద్దాలు పగులగొట్టారని...బస్సును దగ్ధం చేస్తామని బెదిరించారని కాంగ్రెస్ కార్యకర్తలపై కాచిగూడ డిపోకు చెందిన 83జే బస్సు డ్రైవర్ బాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనల్లో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. మరోవైపు చలో రాజ్​భవన్​లో పాల్గొన్న రేణుకా చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. గోల్కొండ పీఎస్​కు తరలించారు. పీఎస్​ వద్ద మీడియా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అనుమతి లేదని పోలీసులు వారించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details