రాజ్యసభలో ఈనెల 4న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కనకమేడల ప్రసంగంపై వైకాపా పార్లమెంటరీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఈనెల 8న ఫిర్యాదు చేస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.