పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు.
AMARAVATHI LESSON DELETED: పదో తరగతి నుంచి ‘అమరావతి’ పాఠం తొలగింపు
పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా... ప్రస్తుతం 11 పాఠాలతోనే కొత్త పుస్తకాలను ముద్రించారు.
పదో తరగతి నుంచి ‘అమరావతి’ పాఠం తొలగింపు
Last Updated : Oct 6, 2021, 9:23 AM IST