ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AASARA PENSION: 3 నెలల్లో 23,846 మంది ఆసరా తొలగింపు - aasara pension Beneficiaries removal in telangana

తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛను(AASARA PENSION) లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. గత మూడు నెలల కాలంలో వివిధ కారణాలతో 23,846 మంది పేర్లను తొలగించారు. మరణాలు, అనర్హత, సకాలంలో జీవన ధ్రువీకరణ ఇవ్వలేదన్న కారణంతో లబ్ధిదారులను జాబితా నుంచి తప్పించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

AASARA PENSION
AASARA PENSION

By

Published : Jul 3, 2021, 11:38 AM IST

తెలంగాణ రాష్ట్రంలో 65 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా(బోదకాలు) బాధితులకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులకు రూ.3016, మిగతా వారికి రూ.2016 చొప్పున ప్రతినెలా చెల్లిస్తోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మార్చి నెలాఖరు నాటికి 37.72 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు(AASARA PENSION) ఉన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఈ సంఖ్య 37.48 లక్షలకు పడిపోయింది. దాదాపు 23వేల మంది పేర్లు తొలగించారు. గతంలో మరణించినా ఇంకా పింఛను పొందుతున్న వారి పేర్లతో పాటు ఇటీవల కన్నుమూసిన వారిని జాబితా నుంచి తొలగించారు. 70 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి బతికున్నట్లు ధ్రువీకరించుకున్నాకే పింఛన్లు జారీ చేస్తున్నారు. ఇటీవల తొలగించిన పేర్లలో ఎక్కువగా చనిపోయిన కేసులు ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి వర్గాలు పేర్కొంటున్నాయి.

అమలుకు నోచని 57 ఏళ్ల వయసు...

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను(AASARA PENSION) పొందాలంటే కనీస అర్హత వయసు 65 ఏళ్లుగా ఉంది. నిరుపేద వృద్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అర్హులను గుర్తించింది. 57-65 ఏళ్ల మధ్య వయసున్న వారు 8.5 లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. 65 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. కరోనా తదితర కారణాలతో ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు. దీంతో అర్హత ఉన్నా ఆసరా పింఛన్లు(AASARA PENSION) అందక వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చదవండి :

రాయలసీమ ఎత్తిపోతల పథకం: ప్రవాహ, లీకేజి నష్టాలు తగ్గించేందుకే పనులు

ABOUT THE AUTHOR

...view details