ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గోడకి ఉండే ‘పూర్ణ వికసిత పద్మం’ నమూనాని బుధవారం తొలగించారు. దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చిహ్నం నమూనాని అమర్చారు. ముఖ్యమంత్రి కుర్చీకి వెనుక ఉన్న గోడకి పెద్ద చక్రం ఆకృతిలో పద్మం నమూనా ఉండేది. తెదేపా ప్రభుత్వ హయాంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించిన తర్వాత... ఒకప్పుడు ఆ ప్రాంతంలో బౌద్ధం విరాజిల్లిందనడానికి గుర్తుగా ‘పూర్ణ వికసిత పద్మం’ నమూనాని ప్రధాన సమావేశ మందిరాల్లోని గోడలపై తాపడం చేయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని గోడకీ అదే నమూనాని తీర్చిదిద్దారు. ఇప్పుడు దాన్ని తొలగించారు.
సీఎం సమావేశ మందిరంలోని 'పూర్ణ వికసిత పద్మం' తొలగింపు - Chief Minister's camp office full blossoming lotus model news
సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గోడకి ఉండే ‘పూర్ణ వికసిత పద్మం’ నమూనాను అధికారులు బుధవారం తొలగించారు. ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నమానాని అమర్చారు.
Removal of a full blossoming lotus model in the Chief Minister's camp office