ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

75% ఇంటర్‌ మార్కుల నిబంధన ఎత్తివేత! - ఇంటర్ మార్కల వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఇంటర్‌, అందుకు సమానమైన పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను ఈ ఏడాదికి ఎత్తివేయాలని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు భావిస్తోంది. వచ్చే జనవరిలో జేఈఈ మెయిన్‌ నిర్వహణ కష్టమే కానుంది.

Removal Inter Marks
Removal Inter Marks

By

Published : Jul 11, 2020, 6:06 AM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఇంటర్‌, అందుకు సమానమైన పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధనను ఈ ఏడాదికి ఎత్తివేయాలని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) భావిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొదటి ర్యాంకు సాధించినా ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేదా బోర్డు పరీక్షల్లో మొదటి 20 పర్సంటైల్‌లో లేకుంటే ప్రవేశం పొందటం ఇప్పటివరకు కుదరదు. ఈసారి కరోనా పరిస్థితుల కారణంగా ఆ నిబంధనను మినహాయించాలని జేఏబీ ఆలోచిస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ సిద్ధార్థ్‌పాండే ‘ఈనాడు’తో చెప్పారు.

అయితే దీనిపై నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రభావం ఉండదని, అడ్వాన్స్‌డ్‌లో అర్హతసాధించి ఐఐటీల్లో సీట్లుపొందిన వారిలో 75శాతం మార్కులు పొందని వారు చాలా తక్కువ మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సెప్టెంబరు 27న జరపాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన మొత్తం 2.50లక్షల మందికి మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశమిస్తారు.

వచ్చే ఏడాది జేఈఈ మెయిన్‌ నిర్వహణ ఆలస్యం

జేఈఈ మెయిన్‌ను గత ఏడాది నుంచి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. జనవరిలో ఒకసారి, తర్వాత ఏప్రిల్‌లో జరపాలి. ఈసారి ఇప్పటివరకు ఏప్రిల్‌ పరీక్ష జరగలేదు. వచ్చే సెప్టెంబరు 1-6వ తేదీ వరకు జరపాలని ఇటీవలే కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ విద్యా సంవత్సరం కళాశాలలు తెరుచుకోలేదు. వచ్చే రెండు నెలల్లో కూడా తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు. దాంతో 2021 జనవరిలో జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించాలంటే సిలబస్‌ పూర్తికాదు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభం, సిలబస్‌ పూర్తి తదితర అంశాలను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) పరిగణనలోకి తీసుకోనుంది. దాంతో వచ్చే ఏడాది మెయిన్‌ పరీక్ష-1 ఆలస్యం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:దుబే ఎన్​కౌంటర్​పై అనుమానాలు? అసలేం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details