ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారన్న ఆరోపణలతో ఆరెస్టైన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీఐడీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఎంపీ రఘురామ కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంచవచ్చన్న కోర్టు... ఆయనకు వై-కేటగిరి భద్రత కొనసాగుతుందని తెలిపింది. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై నివేదిక కోరిన కోర్టు... జీజీహెచ్, రమేశ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఆదేశాలిచ్చింది.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ నెల 28వరకు రిమాండ్ - ఎంపీ రఘురామకృష్ణరాజుకు రిమాండ్
ఎంపీ రఘురామకృష్ణరాజుకు రిమాండ్
20:58 May 15
కోలుకునే వరకు ఆస్పత్రిలోనే...
ఎంపీ రఘురామకృష్ణరాజు శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరినట్లు లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టు వచ్చిన తర్వాతే రిమాండ్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. ఆస్పత్రిలో ఉండే సమయం కూడా రిమాండ్ గడువులోకే వస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి.
సీఎం జగన్ ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు: అచ్చెన్నాయుడు
Last Updated : May 15, 2021, 9:53 PM IST