అనంతపురం జిల్లా జైలులో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానాల గదిలోని కిటికీకి ఉరి వేసుకున్నాడు. మృతుడు కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి అక్బర్ బాషాగా గుర్తించారు. జిల్లాలోని నార్పల, పుట్లూరు మండలాల్లో జరిగిన చోరీ కేసుల్లో మృతుడు నిందితుడిగా ఉన్నాడు. అయితే రిమాండ్‌కు తరలించి 24 గంటలు గడవక ముందే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే ఘటనపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య.. ఇద్దరు అధికారుల సస్పెండ్ - crime news in Anantapuram
రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా జైలులో జరిగింది.మృతుడు కడప జిల్లాకు చెందిన అక్బర్ బాషాగా గుర్తించారు.
![జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య.. ఇద్దరు అధికారుల సస్పెండ్ Remand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8553947-451-8553947-1598363067073.jpg)
Remand
జిల్లా జైలులో ఖైదీ అక్బర్‌బాషా ఆత్మహత్య ఘటనపై అధికారుల చర్యలు తీసుకున్నారు. హెడ్‌వార్డర్ వెంకటకృష్ణ, వార్డర్ నవీన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Last Updated : Aug 25, 2020, 8:51 PM IST