హైదరాబాద్‌లో రోజూ కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్ జలాశయం (Himayat sagar) నిండుకుండలా మారింది. ఈమేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ (Mla Prakash Goud) ఒక గేటు ఎత్తి మూసీలోకి నీరు వదిలారు.
ఒక గేటును 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 1,250 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా జలాశయంలో 1,762.90 అడుగుల నీరు ఉంది. మొదట మూడు గేట్లు ఎత్తాలని భావించారు. ప్రస్తుతం ఒక గేటును మాత్రమే ఎత్తారు. వరదను బట్టి మిగతా గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
- హిమాయత్‌సాగర్
గరిష్ఠ నీటిమట్టం-1,763.50 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం-1,762.90 అడుగులు
సురక్షిత ప్రాంతాలకు తరలించండి...