JEE advanced exam schedule : ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూలు విడుదలయింది. దేశంలోని 23 ఐఐటీల్లోని సుమారు 17వేల సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈ ఏడాది ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్సైట్ ఏర్పాటు చేసి.. సిలబస్‌ను ఖరారు చేసిన ఐఐటీ బాంబే... పరీక్ష నిర్వహణ షెడ్యూలును ప్రకటించింది. జూన్ 8 నుంచి 14 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. జూన్ 27 నుంచి వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. జులై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్2 పరీక్ష నిర్వహిస్తారు. జులై 7న రెస్పాన్స్ షీట్లు విడుదల చేస్తారు. జులై 9న ప్రాథమిక సమాధానాల కీ విడుదల చేసి.. 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జులై 18న తుది సమాధానాల కీతో పాటు ఫలితాలను ప్రకటించనున్నట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది.
JEE advanced exam schedule: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ విడుదల - ఏపీ వార్తలు
JEE advanced exam schedule : ఐఐటీల్లో ప్రవేశాల్లో కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జులై 3న జరగనుంది. జేఈఈ మెయిన్ షెడ్యూలు రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జులై 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు కోసం జులై 18, 19తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. జులై 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు నిర్వహించి 24న ఫలితాలను ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్ షెడ్యూలును రెండు, మూడు రోజుల్లో జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్టీఏ ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించిన ఎన్టీఏ.. ఈ ఏడాది సమయం లేకపోవడంతో రెండుసార్లే జరపాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలలో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జులై 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఐటీ బాంబే పేర్కొంది.
ఇదీ చూడండి:పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్