స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. ఈనెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. ఈనెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు...
ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న తొలివిడత నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు.