అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్నట్లయితే.. ఆ ఆవాసాన్ని క్రమబద్ధీకరించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అడపాదడపా జరిగే ఈ క్రమబద్ధీకరణను మరోసారి కొనసాగించడంపై ఉన్నత స్థాయిలో పరిశీలన జరుగుతోంది. అధికారిక నిర్ణయం అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధ్యయనం చేయించి తదుపరి చర్యలు చేపడతారు.
క్రమబద్ధీకరణకు మళ్లీ అవకాశం! - ఏపీ
అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో నివాసాలకు సంబంధించి ప్రభుత్వం మరో సారి యోచిస్తోంది. ఆ భూముల్ని క్రమబద్ధీకరణ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతోంది.
ఆర్‌సీసీ కప్పు కలిగిన భవనాలు, ఇళ్లు లేదా ఇటుక గోడలతో ఆస్‌బెస్టాస్ పైకప్పు కలిగిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఖాళీ స్థలాలు లేదా గుడిసెలున్న స్థలాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ క్రమబద్ధీకరణకు 2019లో ఉన్న నిబంధనలే కొనసాగించాలా? కొత్తగా ఏమైనా జత చేయాలా? అన్నదానిపై సమీక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షల వార్షికాదాయం, పట్టణాలు/నగరాల్లోనైతే రూ.1.44 లక్షల వార్షికాదాయం కలిగి ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందకుండా ఉన్నవారికి ఈ క్రమబద్ధీకరణలో ప్రాధాన్యమిస్తారు. దరఖాస్తుదారులకు మోటారు వాహనాలు ఉండకూడదు. వ్యవసాయ పనులకు వాహనాలు వినియోగిస్తే మాత్రం మినహాయింపునిస్తారు. వంద చ.అడుగులలోపు ఉంటే నామమాత్ర రుసుం కింద రూపాయి చెల్లిస్తే ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంది. అంతకంటే ఎక్కువ స్థలమైతే ఫీజులు పెరుగుతాయి
ఇదీ చదవండి:భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ సంచులు.. రూపొందించిన డీఆర్డీవో