గ్రామమ సచివాలయాలే రిజిస్ట్రార్ కేంద్రాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఆ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బంది సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉందన్న సీఎం... భవిష్యత్తులోనూ ఇది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియకు కచ్చితంగా బాధ్యులుగా ఉండాలని అన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలన్న ముఖ్యమంత్రి.. మొబైల్ ట్రైబ్యునల్స్‌పైనా ఎస్‌ఓపీలను తయారుచేయాలన్నారు.
సిబ్బందికి శిక్షణ