ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 7:48 PM IST

ETV Bharat / city

తెలంగాణ: ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ధరణి పోర్టల్​తో భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.

cm kcr review on dharani portal
ధరణి పోర్టల్​పై సీఎం కేసీఆర్ సమీక్ష

ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ఆదరణ పొందుతోందని అన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని హర్షిస్తున్నారని పేర్కొన్నారు.

మరో 3, 4 రోజుల్లో అన్ని సమస్యలను ధరణి అధిగమిస్తుందని సీఎం కేసీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details