registration charges: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరిస్తున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులపై పరోక్ష భారాన్ని మోపనున్నాయి. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, సేల్ కం జీపీఏ రిజిస్ట్రేషన్ ఛార్జీల నిబంధనలను మారుస్తూ అధికారులు తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు ప్రధానంగా ఈ కసరత్తులు కొనసాగుతున్నాయి. ఫ్రాంచైస్ అగ్రిమెంట్, ఉమ్మడి హక్కుతో జారీ చేసే పట్టాదారు పాసుపుస్తకాలకు ముందు పార్టిషన్ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించేలా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విభజన హక్కు బదిలీ పేరుతో..
ప్రస్తుతం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ విధానంలో భూయజమానులు, డెవలపర్/డెవలపర్స్ మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం స్టాంపుడ్యూటీ కింద మార్కెట్ విలువపై ఒక శాతాన్ని ప్రభుత్వానికి డెవలపర్ చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల మార్కెట్ విలువ ఉన్న ఎకరా భూమి విక్రయానికి ముగ్గురు యజమానులు, ఒక డెవలపర్/డెవలపర్స్ మధ్య ఒప్పందం కుదిరిందని అనుకుందాం. ఇక్కడ ఒక శాతం ప్రకారం కేవలం రూ.10వేలు స్టాంపుడ్యూటీ ప్రభుత్వానికి జమవుతుంది. ఈ క్రమంలో స్టాంపుడ్యూటీపై అధికారులు పున:సమీక్షించి కీలక ఉత్తర్వులిచ్చారు. ఉదాహరణకు.. నిర్దేశిత భూమిలో మూడంతస్తుల్లో 15 ప్లాట్లను డెవలపర్/డెవలపర్స్ నిర్మించారు. వారి ఏకాభిప్రాయ ఒప్పందం ప్రకారం డెవలపర్‌కు 6, భూయజమానులకు 9ప్లాట్లు వచ్చాయనుకుందాం. ఇక్కడ భూయజమానుల పేర్లపైనే ప్లాట్లు ఉమ్మడిగా ఉంటాయని ఒప్పందంలో ఉంటే అదనంగా స్టాంపుడ్యూటీ తీసుకోరు. దీనికి భిన్నంగా 9 ప్లాట్లను ముగ్గురు మూడు చొప్పున లేదా వారిష్టమొచ్చిన ప్రకారం పంచుకుంటే ఒప్పంద విలువపై 4% (భూమి+నిర్మాణ విలువ కింద) మొత్తాన్ని కన్వేయన్స్ స్టాంపుడ్యూటీ (విభజన హక్కు) కింద చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాట్లను కొత్తగా కొనుగోలు చేసేవారి నుంచి స్టాంపుడ్యూటీ యథావిధిగా వసూలు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. కొత్తగా సృష్టించిన ఛార్జీల పెంపు కూడా తిరిగి కొనుగోలుదారులపైనే పడనుంది.
సేల్-కం-జీపీఏ రిజిస్ట్రేషన్‌లో..
స్వాధీన సేల్-కం-జీపీఏ కింద స్టాంపుడ్యూటీ వసూళ్లలోనూ మార్పు తెచ్చారు. ప్రస్తుత విధానంలో భూయజమాని తరఫున మరొకరు కొంత చెల్లించి పవరాఫ్ అటార్నీ పొందుతున్నారు. దీనివల్ల భూయజమాని నేరుగా రాకుండానే మరొకరికి విక్రయించే అధికారం ఆయనకు లభిస్తుంది. ఈ క్రమంలో 5% స్టాంపుడ్యూటీ చెల్లిస్తున్నారు. ఏజెంటు తానే స్వయంగా ఆ భూమిని కొంటే విక్రయ సమయంలో చెల్లించిన 5% స్టాంపుడ్యూటీలో 4% మినహాయింపునిస్తున్నారు. భూయజమాని తరఫున ఆయన మరొకరికి అమ్మినప్పటికీ 4% మినహాయింపు లభిస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఏజెంటు స్వయంగా కొంటేనే ఈ మినహాయింపునిస్తారు. మూడో వ్యక్తికి విక్రయిస్తే ఈ లబ్ధి చేకూర్చరు.
ఫ్రాంచైసీ ఒప్పందమైతే..