Loan Apps Case: రుణ యాప్, పెట్టుబడుల పేరుతో మోసాలకు సంబంధించి కేసులో 13 డొల్ల కంపెనీలున్నట్లు తేలింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో కంపెనీలు ఏర్పాటు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులను కోరారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రుణ, పెట్టుబడుల అప్లికేషన్ల కేసులో.. తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే కేసునమోదు చేశారు.
ఇదీచూడండి:LOAN APPS: రుణయాప్‌ల కొత్త ఎత్తుగడలు.. హైదరాబాద్‌లో తిష్ట వేసేందుకు యత్నాలు
ఇందులో దాదాపు 2,200 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో హాంకాంగ్, అక్కడి నుంచి చైనా తరలించినట్లు ప్రాథమికంగా తేల్చారు. సులభ రుణాల పేరుతో అమాయకులకు రుణాలు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేశారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలిస్తామంటూ అమాయకులను నమ్మించి పలు యాప్‌ల ద్వారా డబ్బులు స్వీకరించారు. ఆ తర్వాత నగదు చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డారు.