ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ACCMC: 5వ రోజు ఆదే జోరు.. ఏసీసీఎంసీకి వ్యతిరేకంగా తీర్మానాలు - 5th Day Referendum on Formation ACCMC

5th Day Referendum on Formation of ACCMC: ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 5వరోజు నిర్వహించిన గ్రామసభలు ముగిశాయి. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్(ACCMC) ఏర్పాటుకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

ACCMC
ACCMC

By

Published : Jan 11, 2022, 8:22 PM IST

Public Opinion on Formation of ACCMC: అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై 5వ రోజు ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. రాజధాని అమరావతి పరిధిలోని ఐనవోలు, శాఖమూరు, నేలపాడు, దొండపాడులో గ్రామాల ప్రజలు.. 19 గ్రామాలతో కూడిన అమరావతి మున్సిపల్ కార్పొరేషన్​కు వ్యతిరేకంగా తమ నిర్ణయాన్ని తెలిపారు. ఈ మేరకు నాలుగు గ్రామాల్లోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమకు 29 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ప్రతిపాదన.. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్​ను చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 19 గ్రామాలతో కూడిన అమరావతి మున్సిపల్ కార్పొరేషన్​ ఏర్పాటుకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల్లోనూ స్థానికులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నాలుగు గ్రామాల్లోనూ గ్రామ సభలు ప్రశాంతంగా ముగిశాయి. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం నిర్వహించిన గ్రామ సభలకు బుధవారం చివరి రోజు.

ఇదీ చదవండి..:Public Opinion on ACCMC: అమరావతి గ్రామసభల్లో నిరసన గళం.. 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details