పీజీ వైద్య విద్యకు నూతన ఫీజుల విధానాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కళాశాలల వారీగా ఫీజులు నిర్ణయించనుంది. 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ కళాశాలల్లో ఒకే తరహా ఫీజుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వీటికి మూడేళ్ల కాలపరిమితి ముగిసినందున కొత్త ఫీజులను ఖరారు కోసం యాజమాన్యాల నుంచి.. కమిషన్ వార్షిక ఆదాయ వ్యయ వివరాలను కోరింది. 14 ప్రైవేట్, 11 దంత వైద్య కళాశాలల యాజమాన్యాలు వివరాలు సమర్పించాయి.
పీజీ వైద్య విద్య ఫీజలు తగ్గే అవకాశం! - ఏపీలో తగ్గనున్న పీజీ వైద్య విద్య ఫీజులు న్యూస్
పీజీ వైద్య విద్య ఫీజులను 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విధానం మాదిరిగా అన్ని కళాశాలల్లో ఒకే ఫీజు విధానానికి స్వస్తి పలకనున్నారు. కళాశాలల వారీగా ఫీజుల ఖరారు జరగనుంది. వైద్య విద్య ప్రమాణాలు, ప్రత్యేక గుర్తింపులు, యాజమాన్యాలు సమర్పించిన ఆదాయ, వ్యయ, వివరాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ ఉన్నత విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కొత్త ఫీజుల ఖరారు కసరత్తు పూర్తిచేసింది.
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కళాశాలల యాజమాన్యాలతో రెండు రోజుల పాటు సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. కళాశాలల నిర్వహణ ఖర్చులు, ఆస్పత్రి నిర్వహణలో కొన్ని ఖర్చులను, జాతీయ వైద్య మండలి జరిపిన తనిఖీల కోసం యాజమాన్యాల తరఫున అధికారికంగా జరిగిన చెల్లింపులను కూడా ఫీజుల ఖరారులో పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ప్రస్తుత ఫీజుల్లో కనీసం 20 శాతం, ఆపైన తగ్గే అవకాశాలు ఉన్నట్లు జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి తెలిసింది. ఈ తగ్గింపు కన్వీనర్ కోటాలోనే కాకుండా యాజమాన్య కోటా ఫీజుల్లోనూ ఉండబోతుంది. ఒకటి , రెండు కళాశాలల్లో మాత్రం ఫీజుల్లో స్వల్పంగా తగ్గుదల ఉంటుందని సమాచారం. ఓ కళాశాలలో యాజమాన్య కోటాలో ఒక కేటగిరి సీటు భర్తీ ఫీజును 18 లక్షల రూపాయలకు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 24 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అయితే .. ఒకే తరహా ఫీజు విధానాన్నే అనుసరించాలని, కరోనా సేవల్లో ప్రైవేట్ వైద్య కళాశాలలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని యాజమాన్యాల ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తెలంగాణలో మాదిరిగా ఫీజులను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రశ్నించడం నేరమా... షేర్ చేయడం కుట్రా..!