ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గృహ విద్యుత్‌ వినియోగదారులకు తగ్గనున్న  భారం - గృహ విద్యుత్‌ వినియోగదారులకు తగ్గనున్న  భారం

రాష్ట్రంలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు భారం కొంత తగ్గనుంది. ఇప్పటివరకు ముందు సంవత్సరం వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఇకపై ఏ నెలకు ఆ నెలే వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా ఛార్జీలను నిర్ధారించనున్నారు.

విద్యుత్‌ వినియోగదారులకు తగ్గనున్న  భారం
విద్యుత్‌ వినియోగదారులకు తగ్గనున్న  భారం

By

Published : Dec 6, 2019, 6:46 AM IST

రాష్ట్రంలో గృహ విద్యుత్‌ వినియోగదారులకు భారం కొంత తగ్గనుంది. ఇప్పటివరకు ముందు సంవత్సరం వినియోగించిన యూనిట్ల ఆధారంగా కేటగిరీ నిర్ధారించి, ఆ కేటగిరీ ప్రకారమే.. తదుపరి సంవత్సరంలో నెలనెలా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇకపై.. ఏ నెలకు ఆ నెలే వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా కేటగిరీ నిర్ణయించి, ఛార్జీలు తీసుకుంటారు. దీనివల్ల ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి భారం తగ్గుతుంది. రాష్ట్ర విద్యుత్తునియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కంలు బుధవారం సమర్పించిన విద్యుత్తు ఛార్జీల (ఏఆర్‌ఆర్‌) ప్రతిపాదనలో దీన్ని చేర్చాయి. కొత్త విధానంతో 1.5 లక్షల మంది గృహ వినియోగదారులకు రూ.60 కోట్ల భారం తగ్గుతుందని డిస్కంలు లెక్కించాయి. ఆదాయపన్ను పరిధిలోకి రాని కార్పొరేట్‌ రైతులకూ ప్రయోజనం కలిగించేలా కొత్త ప్రతిపాదన తేనున్నాయి.

ప్రస్తుత చెల్లింపుల విధానం

  • ఏడాదిలో 900 యూనిట్ల లోపు వినియోగించే వారినుంచి కేటగిరి ‘ఎ’ కింద శ్లాబ్‌ ఆధారంగా రూ.1.45 - రూ.6.90 వరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. అంటే నెలకు 75 యూనిట్లలోపు వినియోగం ఉండాలి.
  • ఏడాదిలో 901- 2,700 యూనిట్ల మధ్య వినియోగం ఉంటే కేటగిరి ‘బి’ కింద రూ.2.60- రూ.7.75 వరకు శ్లాబ్‌ ఆధారంగా ఛార్జీలను లెక్కిస్తున్నారు. నెలకు సగటున 75- 225 యూనిట్ల మధ్య వినియోగించేవారికి ఈ టారిఫ్‌ వర్తిస్తోంది.
  • విద్యుత్తు వినియోగం 2,700 యూనిట్లు దాటితే ‘సి’ కేటగిరి కింద రూ.2.65 - రూ.9.05 వరకు శ్లాబ్‌ ఉంది.
  • నెలకు 500 యూనిట్లకు మించితే యూనిట్‌కు ప్రస్తుతం రూ.9.05 వసూలు చేస్తున్నారు. దీన్ని రూ.9.95 చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
  • ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం సి కేటగిరీలో ఉన్న వినియోగదారుడు ఏదైనా ఒక నెలలో 100 యూనిట్లే వినియోగిస్తే రూ.300 చెల్లించాలి. తాజా ప్రతిపాదన ప్రకారం అయితే ఆ నెలలో బి కేటగిరీలోకి వస్తారు కాబట్టి, ఆ టారిఫ్‌ ప్రకారం రూ.260 చెల్లిస్తే సరిపోతుంది.

కార్పొరేట్‌ రైతులకు కొత్త ప్రతిపాదనలు
వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పథకం పరిధిలోకి రాని కార్పొరేట్‌ రైతుల కోసం డిస్కంలు మరో ప్రతిపాదన రూపొందించాయి. కార్పొరేట్‌ రైతులు ప్రస్తుతం యూనిట్‌కు రూ.2.5 వంతున చెల్లిస్తున్నారు. దీని ప్రకారం 10 హార్స్‌పవర్‌ మోటారు వినియోగించే రైతులు నెలకు రూ.5వేలు (9గంటల వినియోగానికి) చెల్లించాల్సి వస్తోంది. ఏపీఈఆర్‌సీకి బుధవారం సమర్పించిన ప్రతిపాదనల్లో హార్స్‌పవర్‌కు నెలకు రూ.200 వసూలు చేయాలని భావిస్తున్నాయి. దీని ప్రకారం నెలకు సుమారు రూ.2వేలు చెల్లిస్తే సరిపోతుందని డిస్కంలు లెక్కతేల్చాయి.

ఇదీచదవండి

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతకు కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details