కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని వినతిపత్రం ఇచ్చారు. సుదీర్ఘ పోరాటం తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని వెల్లడించారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా విశాఖ ఉక్కు నిలిచిందన్న తెదేపా ఎంపీలు... విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వాజపేయీ ప్రభుత్వం చూపిన చొరవను గుర్తుచేశారు.
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించండి' - TDP MPs comments on Visakhapatnam Steel Plant
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను తెదేపా ఎంపీలు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని వినతిపత్రం ఇచ్చారు. గతంలో వాజపేయీ ప్రభుత్వం చూపిన చొరవను గుర్తుచేశారు.
తెదేపా ఎంపీలు