ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాల విద్యాశాఖలో సిఫార్సు బదిలీలు

పాఠశాల విద్యాశాఖలో సాధారణ బదిలీలకు సిఫార్సులు ఊపందుకున్నాయి. తమకు కావాల్సిన ప్రాంతాల్లో బదిలో కోసం కొందరు ఉపాధ్యాయులు పైరవీలు ప్రారంభించారు. అయితే రాజకీయ అండతో చేసిన అక్రమ బదిలీలు రద్దు చేయాలని యూటీఎఫ్​, ఏపీటీఎఫ్​ డిమాండ్​ చేశాయి.

పాఠశాల విద్యాశాఖలో సిఫార్సు బదిలీలు
పాఠశాల విద్యాశాఖలో సిఫార్సు బదిలీలు

By

Published : Jul 12, 2020, 9:54 AM IST

పాఠశాల విద్యాశాఖలో కౌన్సెలింగ్‌ ద్వారా సాధారణ బదిలీలు చేపట్టేందుకు దస్త్రం కదులుతుండగానే సిఫార్సు బదిలీలు సైతం జోరందుకున్నాయి. కొందరు ఉపాధ్యాయులు తమకు కావాల్సిన పాఠశాలలో చేరేందుకు పైరవీలు ప్రారంభించారు. మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఈసారి జరుగుతాయని వేలాదిమంది ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈలోపు ప్రభుత్వ విచక్షణాధికార బదిలీలు చేయడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పరస్పర అంగీకార బదిలీలూ చేసేస్తున్నారు.

విద్యాశాఖకు సంబంధంలేని గత ఏడాది ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కోట్‌ చేస్తూ ప్రస్తుత సిఫార్సులు చేస్తున్నారు. ఇలా జూన్‌ నుంచి ఇప్పటివరకు సచివాలయం నుంచి 16 బదిలీలు జరిగాయి. వీరిలో కొందరికి పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఈ సందర్భంగా... రాజకీయ పలుకుబడితో చేసిన అక్రమ బదిలీలను రద్దు చేయాలని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ డిమాండ్‌ చేశాయి.

ABOUT THE AUTHOR

...view details