Facebook: ఫేస్‌బుక్‌లో వ్యక్తులు, సంస్థలను అశ్లీలంగా చిత్రీకరిస్తూ.. బూతులు తిడుతూ.. యువతుల మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలను పెడుతున్నా.. కొన్నిసార్లు వాటిని యాజమాన్య ప్రతినిధులు తొలగించడం లేదు. మనకు అశ్లీలం, అసభ్యం అనిపించినవి.. వారికి సాధారణంగా అనిపించడమే ఇందుకు కారణం. పోలీసు అధికారులు విషయాన్ని వివరిస్తుంటే.. ఫేస్‌బుక్ ప్రతినిధులు సదరు పోస్టులు అప్‌లోడ్ చేస్తున్న వారి వివరాలు ఇస్తున్నారు కానీ, వాటిని తొలగించడం లేదు. వాటిని వెంటనే తొలగించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Facebook: ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టులు ఎందుకు తొలగించట్లేదంటే..?
Facebook: ఫేస్‌బుక్‌లో పెడుతున్న పలు అభ్యంతరకర పోస్టులను ఆ సంస్థ తొలగించట్లేదు. దానికి కారణం.. అశ్లీలంగా అనిపించిన పోస్టులు.. వారికి సాధారణంగా అనిపించటమే..!
ఫేస్‌బుక్
తీవ్రమైతేనే స్పందన
- పోలీసులు పంపించిన సమాచారం ఆధారంగా ఫేస్‌బుక్ ప్రతినిధులు వెంటనే వీడియోలను తొలగించడం లేదు. ఆ పోస్టులో తీవ్రత ఉందని వాళ్లు భావిస్తేనే స్పందిస్తున్నారు.
- పాక్షిక నగ్న, చుంబన దృశ్యాలు, కౌగిలింతలను విదేశాల్లో అభ్యంతరకరంగా భావించడం లేదు. వీడియోల్లోనూ మరీ అభ్యంతరకరం అనిపిస్తే తప్ప తొలగించడం లేదు.
- ఫలానా యువతిని పోస్టుల ద్వారా వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించినా సరే.. ఫేస్‌బుక్ ప్రతినిధులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి దృశ్యాల వల్ల బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదముందని సవివరంగా చెప్పగలిగినప్పుడే స్పందిస్తున్నారని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.
ఇవీ చూడండి: