ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీరు సన్నద్ధంగా ఉన్నారా? - corona effect latest news

కరోనా మహమ్మారి మన ముంగిట్లోకీ వచ్చింది. అంటే మనమిప్పుడు రెండోదశలోకి చేరామనే అర్థం. ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నాయి. వైద్యులు, అధికార యంత్రాంగాన్ని సిద్ధంచేశాయి. అంతవరకే సరిపోతుందా? లేదు... ప్రతి పౌరుడూ తనవంతుగా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరమొచ్చింది. విపత్తు రాకముందు (మొదటిదశ), వచ్చిన తర్వాత(రెండోదశ), గండం గడిచిన తర్వాత(మూడోదశ) మనం ఏమేమి చేయాలంటే...

ready for corona to face
ready for corona to face

By

Published : Mar 24, 2020, 6:46 AM IST

  1. మొదటి దశ- ప్రణాళిక(ఇంటిని సిద్ధం చేసుకోండి)
  • చర్చించండి:ఒకవేళ కరోనా విజృంభిస్తే ఏం చేద్దాం అనే అంశంపై మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో చర్చించండి. ఏమేం సిద్ధం చేసుకోవాలో, సమకూర్చుకోవాలో చర్చించండి.
  • పరిశుభ్రంగా ఉండండి: ప్రతిరోజూ వ్యక్తిగత, కుటుంబ, పరిసరాల పరిశుభ్రతకు అగ్రాసనం వేయండి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే వారిని ఏకాంతంగా ఉంచడానికి ముందే ఒక గదిని సిద్ధం చేసుకోండి.
  • గుర్తించండి: వైరస్‌ బారిన పడటానికి అవకాశమున్న వృద్ధులను, దీర్ఘకాలిక, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి, ప్రత్యేక జాగ్రత్తలు ఆరంభించండి.
  • ఇరుగుపొరుగుతో మాట్లాడండి: మీ ఇంటి ఇరుగుపొరుగు వారు సామాజిక మాధ్యమాలు, ప్రజారోగ్య అధికారులతో అనుసంధానమై ఉంటే వారిలో మీరూ చేరిపోండి.
  • సేకరించండి: ఆపదలో చేయూతనిచ్చే స్వచ్ఛంద సంస్థలు, వైద్య, ఆర్థిక, ఆహార విషయాలలో సాయం చేసే సంస్థల చిరునామాలు, ఫోన్‌ నంబర్లను సేకరించండి. స్థానిక అధికారుల ఫోన్‌ నంబర్లనూ తీసుకోండి.

2. రెండో దశ- కార్యాచరణ

  • ప్రణాళిక అమలు: మీ ప్రాంతంలో కరోనా కేసులు నమోదైతే ఎప్పటికప్పుడు ప్రభుత్వమిచ్చే సమాచారం తెలుసుకుంటూ... సూచనలను కచ్చితంగా పాటించండి.
  • ఇంట్లోనే ఉండండి: మీ ఇంట్లో, ఇరుగుపొరుగున ఎవరికైనా కరోనా లక్షణాలుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకండి.
  • మానసిక ఒత్తిడిపై దృష్టి: మీకుటుంబ సభ్యులు, స్నేహితులు ఒత్తిడికి గురికావచ్చు. మీరు ధైర్యంగా ఉంటూ... వారు మానసికంగా ధైర్యంగా ఉండేలా భరోసా ఇవ్వండి.
  • కార్యాలయానికి సమాచారం: మీరు పనిచేసే కార్యాలయం అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడండి. అవసరమైతే ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని కోరండి.
  • పిల్లల నియంత్రణ: విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు బయట ఆడటానికి, గుంపులుగా ఉండటానికి ఇష్టపడతారు. పొంచి ఉన్న విపత్తుపై వారికి అర్థమయ్యేలా వివరించండి.

3. మూడో దశ- కొనసాగింపు

  • సమీక్షించండి: మీ ప్రాంతంలో కరోనా ప్రభావం చాలా రోజులపాటు కొనసాగొచ్చు. అందుకని ఎప్పటికప్పుడు మీ ప్రణాళిక, దాని అమలుపై సమీక్షించుకోండి. ఏమైనా లోపాలున్నాయా? అనే కోణంలో కుటుంబ సభ్యులతో మాట్లాడండి.
  • భాగస్వాములవండి: మీ కాలనీ సంక్షేమ సంఘ సమావేశంలో పాల్గొనండి. మున్ముందు ఇలాంటి విపత్తులు వస్తే ఎలా ఎదుర్కొనాలో ముందస్తు ప్రణాళిక వేసుకోండి.
  • ఏమీ ఆపొద్దు: వ్యాధి తగ్గిందని నిర్లక్ష్యం వద్దు. జాగ్రత్తలన్నీ కొనసాగించండి. వ్యక్తిగత, ఇంటి, పరిసరాల పరిశుభ్రతను ఎల్లవేళలా కాపాడుకోండి.
  • ఉద్వేగాల నియంత్రణ: మహమ్మారి విజృంభించిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఎంతో ఆందోళనకు గురై ఉంటారు. వారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నం చేయండి.
  • పిల్లలతో ప్రేమగా: మహమ్మారి తాకిడి సమయంలో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురై ఉంటారు. వారిని సాధారణ స్థితికి తేవడానికి ప్రేమగా మాట్లాడండి. ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

ఇవీ చదవండి :లాక్​డౌన్​పై సీఎం సమీక్ష.. పటిష్ట అమలుకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details