గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి మాజీ సర్పంచ్ మల్లెల శ్రీనాథ్ చౌదరి.. శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఆయన 60 ఎకరాలు ఇచ్చారు. పేదలపై మమకారంతో వారి బాధల్లో పాలుపంచుకుంటూ.. అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
తాడికొండ సమితి అధ్యక్షుడుగా, రాయపూడి పంచాయతీ సర్పంచ్‌గా.. 20 సంవత్సరాలు శ్రీనాథ్ చౌదరి సేవలందించారు. 2004లో అమరావతిలోని శ్రీ శ్రీ రామకృష్ణ హిందూ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌గా విశేష సేవలు అందించి.. ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి తమకు తీరని లోటని.. రాజధాని గ్రామ ప్రజలు తెలిపారు.