ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైరల్: గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్' - రావాలి జగన్ కావాలి జగన్ వార్తలు

'రావాలి జగన్.. కావాలి జగన్'... ఏపీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన నినాదం. ఈ పదాలు వింటే చాలు ఏపీ సీఎం జగన్ గుర్తు రావటం ఖాయమే. ఇప్పుడు ఇదే నినాదం గ్రేటర్ పోరులోనూ తెరపైకి వచ్చింది. అదేంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయటం లేదు కదా... ఈ నినాదం వినిపించడమేంటి అనుకుంటే పొరపాటే...! ఇందుకో లెక్క ఉంది....!

ravali-jagan-kavali-jagan
ravali-jagan-kavali-jagan

By

Published : Nov 21, 2020, 5:18 PM IST

గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'

తెలంగాణలో జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఎన్నికల ప్రచారంలో మాత్రం ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. కారణం...'రావాలి జగన్- కావాలి జగన్' అనే నినాదమే...! తెరాస పార్టీ తరపున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ప్రచారం రథంపై ఈ నినాదం దర్శనమిస్తోంది. అయితే ఇది చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రచారం రథం మార్చలేదా...? ఏపీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఎవరో వాడిన ఎన్నికల ప్రచార వాహనాన్ని హడావుడిగా తీసుకొచ్చి దానికి గులాబీ రంగు వేసి వాడుకుంటున్నారేమో అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరికొందరేమో ‘స్టిక్కర్‌ను తొలగించడం మర్చిపోయారేమో అంటూ పేర్కొంటున్నారు. వైకాపా-తెరాస కలిసి పోటీ చేస్తున్నాయా..? తెరాసకు వైకాపా మద్దతు ప్రకటించిందా...? అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఆ వాహనంపై అలా ఎందుకు రాశారని మీకూ డౌట్ వస్తోందా.....? అసలు విషయానికొస్తే.... జీహెచ్ఎంసీ పరిధిలోని జగద్గిరిగుట్ట నుంచి కొలుకుల జగన్ అనే వ్యక్తి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పేరు కూడా జగన్ కాబట్టి, తన ఎన్నికల ప్రచార రథంపై '‘రావాలి జగన్.. కావాలి జగన్'’ అని రాయించాడు. ఇంకేముంది ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

...view details