ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RATION DEALERS: ఆగని రేషన్ డీలర్ల ఆందోళన.. ఈరోజు గిడ్డంగుల వద్ద నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణ డీలర్లు ఆందోళన(ration dealers statewide agitations) ఇవాళ కూాడా కొనసాగనుంది. జీవో నంబర్ 10 రద్దు, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని రేషన్​ డీలర్లు సంఘం డిమాండ్ చేస్తోంది.

ration dealers protest news
ration dealers protest news

By

Published : Oct 27, 2021, 7:39 AM IST

Updated : Oct 27, 2021, 12:36 PM IST

చౌకధర దుకాణ డీలర్ల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించే వరకు నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఉన్నతాధికారులతో చర్చలు..

రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు బుధవారం చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్​తో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని.. ఇవాళ గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.

పంపిణీ ఆగదు..

రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి నాని అన్నారు. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని.. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు సూచించారు.

కొడాలి నానితో సమావేశం కానున్న రేషన్​డీలర్లు..

విజయవాడలో రెండోరోజు రేషన్‌ డీలర్ల ఆందోళన చేపట్టారు. గొల్లపూడిలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద డీలర్లు నిరసన చేపట్టారు. జీవో నెం.10 రద్దు, కమీషన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాాగా రేషన్ డీలర్ల నేతలు మంత్రి కొడాలి నానితో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి:Ration dealers Agitation: ఆ జీవో రద్దు చేయాలంటూ రేషన్​ డీలర్ల ఆందోళనలు.. !

Last Updated : Oct 27, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details