చౌక ధరల దుకాణదారుల సమస్యల పరిష్కారం కోరుతూ పిటిషనర్ సంస్థ సమర్పించబోయే వినతిని పరిశీలించి మూడు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి తాజాగా వినతి సమర్పించాలని పిటిషనర్‌కు స్పష్టంచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. చౌకధరల దుకాణ డీలర్లకు కమీషన్, బకాయిలు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం. గిరిజారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రేషన్ డీలర్ల సమస్యలపై మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోండి - రేషన్ డీలర్ల పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్
చౌక ధరల దుకాణదారుల అందించిన వినతిని పరిశీలించి మూడు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో వినతి సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. రేషన్ డీలర్ల కమీషన్, బకాయిలు విడుదల చేయకపోవడంపై చౌక ధరల దుకాణదారుల సంఘం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
కరోనా సమయంలో నిత్యావసర సరకుల పంపిణీకి డీలర్లు సొంత సొమ్ము ఖర్చు చేశారన్నారు. డీలర్లకు బీమా కల్పించాలని, ఆరోగ్య కార్డులు జారీచేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. పౌరసరఫరాలశాఖ తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ .. ఇప్పటికే అందిన వినతిపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మరికొన్ని అభ్యర్థనలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీనివాసరావు స్పందిస్తూ .. ఈ ఏడాది జూలై 18న ఓ వినతి సమర్పించామన్నారు. ఇరు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తాజాగా వినతి సమర్పిస్తే ప్రభుత్వం దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి :జాతీయ రహదారిపై నోట్ల కట్టలు.. ఎవరివి..?