ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు.. కేంద్రమంత్రి భిన్న ప్రకటనలు

పోలవరం పూర్తిపై కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా రెండు సమాధానాలిచ్చారు. ఇద్దరు ఎంపీలకు వేర్వేరు తేదీలు చెప్పారు. ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరాలున్నాయని వెల్లడించారు.

By

Published : Nov 19, 2019, 7:36 AM IST

రతన్‌లాల్‌ కటారియా

పోలవరం పూర్తిపై కేంద్రమంత్రి రెండు మాటలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే తేదీపై కేంద్రమంత్రి రెండు మాటలు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా రెండు.. వేర్వేరు తేదీలతో సమాధానమిచ్చారు. ఒకరికి 2021 జూన్‌ అని చెప్పి... మరొకరికి 2021 డిసెంబర్‌ అని సమాధానం చెప్పారు. ప్రాజెక్టును 2018 మార్చి నాటికి పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు అధారిటీ.. డీపీఆర్‌లో పేర్కొందని... ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సూచన మేరకు ఏపీ ప్రభుత్వం... పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ సూచన మేరకు నవయుగ, బెకెమ్‌ సంస్థలను ఏపీ సర్కారు 2019 ఆగస్టులో తొలగించింది. 15 వందల 48 కోట్ల పనులను మేఘా సంస్థకు అప్పగించింది. నవంబర్‌ నుంచి పనులు మొదలయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారంటూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నకు.. కేంద్రమంత్రి సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశాకు అభ్యంతరాలున్నాయని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details