ధరలు పెరిగినంతగా ఏదీ ఆదాయం నిత్యావసరాల ధరల పెరుగుదలతో.. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. నలుగురు ఉండే కుటుంబంలో సగటున నెలకు 50 కిలోల బియ్యం వినియోగిస్తారు. కిలోకు 6.11 చొప్పున పెరిగితే నెలకు రూ.305, ఏడాదికి రూ.3,666 ఖర్చు పెరిగినట్లే. నెలకు 4 లీటర్ల నూనె రూపంలో.. ఏడాదికి రూ.2,400 అదనపు భారమే. ఉల్లి నెలకు 3 కిలోల లెక్కన చూసినా రూ.400 పైన అదనంగా మోయాల్సి వస్తుంది. పప్పులు, చింతపండు, మిర్చి.. తదితర నిత్యావసరాలనూ కలిపితే.. ఒక్కో కుటుంబంపై సగటున ఏడాదికి రూ. 7-8 వేల వరకూ ఖర్చులు పెరుగుతున్నాయి.
ధరల స్థాయిలో పెరగని ఆదాయం
ధరలు పెరిగినంతగా ఏదీ ఆదాయం చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో పని దొరికితేనే రోజు గడుస్తుంది. నిత్యావసరాల ధరల స్థాయిలో వీరి ఆదాయం పెరగలేదు. స్వర్ణకారులకు ఏడేళ్లలో రూ.107 మాత్రమే కూలీలో పెరుగుదల కన్పించింది. అంటే ఏడాదికి రూ.16లోపే. 2019-20తో పోలిస్తే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయంలో పెరుగుదల సగటున 13% లోపే ఉంది. ఈ కాలంలో వడ్రంగి పనివారికి 9.17%, స్వర్ణకారులకు 5.71%, చర్మకారులకు 7.71%, వ్యవసాయ కూలీల్లో పురుషులకు 13.04%, మహిళలకు 12.03% చొప్పున మాత్రమే రోజు కూలీ పెరిగింది.
ధరలు పెరిగినంతగా ఏదీ ఆదాయం ఇదీ చదవండి:
Polavaram: మారిన నదీ సహజ ప్రవాహ మార్గం..రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా డెల్టాకు నీళ్లు!