ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు - నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు

RAPE ON MINOR GIRL: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

RAPE ON MINOR GIRL
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

By

Published : Oct 19, 2022, 12:00 PM IST

Updated : Oct 19, 2022, 2:54 PM IST

RAPE ON MINOR GIRL: బుడిబుడి నడకలతో పాఠశాలకు వచ్చే ఓ చిన్నారితో అదే పాఠశాల ప్రిన్సిపల్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి జుగుప్సాకరమైన రీతిలో ప్రవర్తించాడు. అతడి చేష్టలతో అభం, శుభం తెలియని ఆ చిన్నారి నీరసంగా ఉండటంతో అనుమానించిన తల్లి విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లి సదరు డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి ఎల్‌కేజీ చదువుతోంది. కొన్నాళ్లుగా నీరసంగా ఉంటున్న బాలిక సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక ఏడుస్తుండటంతో తల్లి బిడ్డను ఎత్తుకొని ఆరా తీసింది. పాఠశాల ప్రిన్సిపల్‌ వద్ద పదేళ్లకు పైగా డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు, రెండు నెలలుగా ఇదే తరహాలో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకున్నారు.

మంగళవారం నేరుగా తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడే ఉన్న డ్రైవర్‌ని చితకబాదారు. ఒక దశలో పాఠశాల ప్రిన్సిపల్‌పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. సిబ్బంది సర్దిచెప్పడంతో శాంతించారు. డిజిటల్‌ క్లాస్‌రూంలో పిల్లలతో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నా.. దృష్టి పెట్టలేదని ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్సైలు అంబిక, మనోజ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని డ్రైవర్‌ రజనీకుమార్‌ను అరెస్టు చేశారు.

ప్రిన్సిపల్‌, సిబ్బందిని పోలీసులు విచారించారు. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించామని, నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ తెలిపారు. స్థానికులు బంజారాహిల్స్‌ ఠాణా వద్దకు చేరుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు.

ఇవీ చూడండి:

Last Updated : Oct 19, 2022, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details