తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. సూర్యోదయ కాలనీలో నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసే రమేశ్ అనే మృగాడు మంగళవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రమేశ్ తన తోటి కూలీ కుమార్తె నోట్లో గుడ్డలు కుక్కి... అత్యాచారానికి యత్నించాడు.
బాలిక కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. వారిని చూసిన రమేశ్ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు అమీన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... వైద్య పరీక్షల కోసం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్పూర్ పోలీసులు తెలిపారు.