'నిర్భయ' వచ్చినా ఏది భయం - increase of rapes in india
నిర్భయ చట్టం వచ్చినా దేశంలో అత్యాచారాలు తగ్గడం లేదు. చట్టం వచ్చిన తర్వతా ఫిర్యాదులు, శిక్షల సంఖ్య పెరిగినా... అరాచకాలు ఎక్కువుతుండటం ఆందోళన కలిగించే విషయమే... 2017 సంవత్సరం వరకు విడుదల చేసిన గణాంకాలు ప్రకారం అత్యాచార రేటు ఇలా ఉంది...
దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబరు 16న జరిగిన అత్యాచార ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం కఠినమైన నిర్భయ చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రాలూ తమ పరిస్థితులకు అనుగుణంగా సొంత చట్టాలు రూపొందించాయి. మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు, దళాలను ఏర్పాటు చేశాయి. అయినా మహిళలపై అకృత్యాలు ఆగడంలేదు... సరికదా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో, వరంగల్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనాలు. 2012కన్నా ముందు అత్యాచారాలపై ఫిర్యాదుచేయడానికి మహిళలు పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక ఫిర్యాదులు, శిక్షల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ అత్యాచారాలూ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2017 సంవత్సరం వరకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. (2018, 2019 గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు).
మధ్యప్రదేశ్ | 14.7 |
ఛత్తీస్‌గఢ్ | 14.6 |
దిల్లీ | 12.5 |
అస్సాం | 11.0 |
కేరళ | 10.9 |
ఒడిశా | 9.7 |
అరుణాచల్‌ప్రదేశ్ | 9.4 |
రాజస్థాన్ | 9.3 |
ఛండీగఢ్ | 8.6 |
హరియాణ | 8.6 |
మేఘాలయ | 8.5 |
గోవా | 8.2 |
హిమాచల్ ప్రదేశ్ | 7.1 |
ఉత్తరాఖండ్ | 7.1 |
దామన్, దీన్ | 6.2 |
సిక్కిం | 5.5 |
ఝర్ఖండ్ | 5.5 |
త్రిపుర | 5.0 |
జమ్ముకశ్మీర్ | 4.9 |
మిజోరం | 4.8 |
అండమాన్ నికోబార్ | 4.7 |
ఉత్తరప్రదేశ్ | 4.0 |
పంజాబ్ | 3.9 |
ఆంధ్రప్రదేశ్ | 3.8 |
మహారాష్ట్ర | 3.3 |
మణిపుర్ | 3.1 |
తెలంగాణ | 3.0 |
పశ్చిమబెంగాల్ | 2.4 |
కర్ణాటక | 1.8 |
గజరాత్ | 1.6 |
బిహార్ | 1.2 |
నాగాలాండ్ | 0.9 |
పుదుచ్చేరి | 0.9 |
తమిళనాడు | 0.8 |
దాద్రా నాగర్ హవేలీ | 0.5 |
లక్షదీవులు | 0 |