కేరళలో రోడ్డు ప్రమాదం.. ఆంధ్రావాసి మృతి - andhara member died in kerala road accidents
కేరళలో శబరిమలైవైపు వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైంది. అల్లాపారా ప్రాంతానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. వాహనం బైక్ను ఢీకొట్టి ఆపై.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. రాష్ట్రానికి చెందిన రాజు ఈ ఘటనలో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తిని కేరళకు చెందిన ద్విచక్రవాహనదారుడు జోస్గా గుర్తించారు. మరో 10 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వాహనం నుజ్జు నుజ్జు అయింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.