Range Rover Car Burnt:తెలంగాణ రాజధాని హైదరాబాద్ లక్డీకపూల్‌లో ఓ రేంజ్ రోవర్ కారు అగ్నికి ఆహుతి అయ్యింది. లక్డీకపూల్ వెంకటేశ్వర హోటల్ ముందుకు రాగానే రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన కారులో ఉన్న ఇద్దరు.. వెంటనే కారును పక్కకు ఆపేసి అందులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే.. కారు మంటల్లో కాలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక మంటలను ఆర్పేశారు. వరంగల్‌కు చెందిన వ్యాపారవేత్త సామల వంశీకృష్ణ.. మాసబ్ ట్యాంక్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వాహనాలు అధికంగా వెళ్లే మార్గం కావడంతో.. ఈ ఘటన వల్ల కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కారులో మంటలు.. దగ్ధమైన రేంజ్‌రోవర్! - అగ్నికి ఆహుతైన రేంజ్ రోవర్ కారు
Range Rover Car Burnt: తెలంగాణలోని హైదరాబాద్ లక్డీకపూల్ ప్రాంతంలో రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో గమనించిన కారులో ఉన్న ఇద్దరు.. వెంటనే పక్కకు నిలిపేసి బటకు వచ్చేశారు. కారు అగ్నికి ఆహుతి అయ్యింది..!
Range Rover Car Burnt