ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 5:13 PM IST

ETV Bharat / city

హైదరాబాద్ వనస్థలిపురంలో కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. రేపట్నుంటి వారం రోజుల పాటు ఈ ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో కంటైన్మెంట్ జోన్లు
హైదరాబాద్ వనస్థలిపురంలో కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ వనస్థలిపురంలోని 4 ప్రాంతాల్లోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. కంటైన్మెంట్ జోన్లలో రేపట్నుంటి వారం రోజులపాటు రాకపోకలు నిలిపివేయనున్నారు. నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయనున్నారు.

కంటైన్మెంట్ జోన్లుగా హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్​, రైతుబజార్ సమీపంలోని ఎ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్​కెడినగర్, రైతుబజార్-సాహెబ్‌నగర్​ను అధికారులు ప్రకటించారు.

వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురం పరిధిలో 169 కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

ఇదీ చదవండి :బండికి బ్యాంకు స్టిక్కర్... బస్తాలో బీరు సీసాలు..!

ABOUT THE AUTHOR

...view details