సీఐడీ నోటీసులు చూసి ఆశ్చర్యపోయా:రంగనాయకమ్మ సీఐడీ నోటీసులు ఇవ్వడంపై రంగనాయకమ్మ స్పందించారు. విశాఖ ప్రమాదంపై ఫేస్బుక్లో కేవలం తన అభిప్రాయాన్ని షేర్ చేశానని చెప్పారు. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని స్పష్టం చేశారు. సీఐడీ నోటీసులు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. విశాఖ బాధితులకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.
అభిప్రాయం చెబితే కేసులా..?
రంగనాయకమ్మను తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. సాధారణ మహిళ అభిప్రాయం చెబితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలి: హైకోర్టు