సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో కీలక ఘట్టం ముగిసింది. రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత.. అమ్మవారి మాటగా భవిష్యవాణి వినిపించారు. పూజల పట్ల ఏ మాత్రం సంతోషంగా లేనని గతేడాది రంగం కార్యక్రమంలో చెప్పిన అమ్మవారు.. ఈ ఏడు మాత్రం భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. పూజలు సంతోషంగా అందుకున్నట్లు తెలిపారు. భక్తులు, ప్రజలను సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు.
" మహమ్మారితో ఎన్ని ఇబ్బందులు పడ్డా నీకు పూజలు చేశాం తల్లీ. నిన్ను కొలిస్తే.. మా బాధలు తొలగుతాయని నమ్మాం. నీ ఆశీర్వాదంతో మేము సుఖ సంతోషాలతో ఉంటాం. సకాలంలో వానలు, చక్కటి ఎండలతో పంటలు సమృద్ధిగా పండాలని ఆశీర్వదించు తల్లీ"
- పూజారి