ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ramzan: రాష్ట్రంలో రంజాన్ సందడి.. ప్రత్యేక ప్రార్థనలు - ఏపీ తాజా వార్తలు

Ramzan prayers: రంజాన్ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ వైభవంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా రాయపూడిలో ఈద్గా లేకపోవడంతో ముస్లింలు రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. బాపట్లలోని ఇస్లాంపేట్ లో ముస్లింలు సామూహిక ప్రార్ధనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Ramzan prayers
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్​ ప్రార్థనలు

By

Published : May 3, 2022, 12:31 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రంజాన్​ ప్రార్థనలు

Ramzan prayers: ప్రకాశం జిల్లా మార్కాపురం కంభం రోడ్డులోని ఈద్గాలో నిర్వహించిన ప్రార్ధనల్లో స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. అనంతపురంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్ధనలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కర్నూలులో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యేలు హాఫీస్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంపీ సంజయ్ కుమార్... పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. నంద్యాలలోని నూనెపల్లె కుబ్రా ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో కలెక్టరు మనిజీర్ జిలాని సామున్ పాల్గొన్నారు. యానాంలోని జామా మసీదులో ముస్లింలు యాచకులకు దానం చేశారు. నెల్లూరులోని వీఆర్సీ క్రీడా మైదానంలో జరిగిన ప్రార్ధనల్లో తెలుగుదేశం నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జామియా మసీదులోనూ రంజాన్ వేడుకలు జరిగాయి. అల్లా దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని ముస్లింలు ప్రార్ధించారు.

ఇదీ చదవండి:నేడే రంజాన్​.. ముస్లిం సోదరులకు ప్రముఖుల శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details